కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గంజాయి (Gadwal Ganja Seized) విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదివారం గద్వాల టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకోగ వారి నుంచి సుమారు 6కేజీల గంజాయి, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఇటిక్యాల మండలం శనగపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆదివారం సాయంత్రం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గంజాయి విక్రయించేందుకు రాగ గద్వాల టౌన్ ఎస్ఐ కల్యాణ్ కుమార్ నమ్మదగ సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా కేంద్రంలో కలకలం
ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా ఒకరు పరారయ్యారు. భారీగా గంజాయి దొరకడం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. తమ వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేసి విక్రయించేందుకు గద్వాలకు వచ్చారా లేదా గద్వాలలో గంజాయి సరఫరాదారులకు విక్రయించేందుకు వచ్చిన క్రమంలో పట్టుబడారా అనేది పోలీసుల విచారణలో తేలనున్నది. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ఎన్ని కేజీలుందో ఇంకా తెలియాల్సి ఉంది. విక్రయించేందుకు వచ్చిన వారు ఎక్కడ నుంచి తీసుకవచ్చారో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

