మహిళా కూలీలతో భట్టి ముచ్చట్లు.. సంక్షేమ పథకాలపై ఆరా!

కలం, ఖమ్మం బ్యూరో: మండుటెండను సైతం లెక్కచేయకుండా పొలాల్లో చెమటోడ్చే శ్రమజీవుల కష్టసుఖాలను తెలుసుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). ఆదివారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో ఆయన పర్యటించారు. పర్యటనలో హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, కూలీ పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూ క్యారేజీలు విప్పుకుంటున్న ఆడబిడ్డల మధ్యకు వెళ్లారు. “ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ ఇళ్లకు అందుతున్నాయా తల్లులారా?” అంటూ ఆప్యాయంగా పలకరించారు.

​డిప్యూటీ సీఎం పలకరింపుతో భావోద్వేగానికి లోనైన మహిళా కూలీలు, ప్రజా ప్రభుత్వం వచ్చాక తమ జీవితాల్లో వచ్చిన మార్పులను ఆయనతో పంచుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో ఇళ్లలో కడుపునిండా అన్నం తింటున్నామన్నారు. గృహ జ్యోతి పథకంతో కరెంట్ బిల్లుల భారం తప్పిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లేటప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో కలిసి వస్తోందన్నారు. మిగిలిన డబ్బులు కుటుంబ అవసరాలకు ఆసరాగా నిలుస్తున్నాయని తెలిపారు.

​ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజలు ఉచితంగా పొందుతున్న ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం నిధులు చెల్లిస్తోందని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని తీరుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ ఇందిరమ్మ ప్రజాప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>