కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) నివాసంలో రాఖీ పర్వదినం వేడుకలు నిర్వహించారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ ఎర్రవల్లిలోని నివాసానికి వచ్చి కేసీఆర్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌‌కు రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. వారిద్దరికి కేసీఆర్ దంపతులు పట్టుచీరలు పెట్టి ఆశీర్వదించారు. రక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరీ సోదరుల మధ్య అనుబంధానికి రాఖీ పండుగ వారధిగా నిలుస్తోందన్నారు. కుటుంబ జీవితాల్లో రాఖీ పండుగకు ప్రత్యేక సంప్రదాయం, విశిష్టమైందిగా అభివర్ణించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>