గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మ‌రో రికార్డు!

క‌లం, వెబ్‌డెస్క్: భారతీయ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) చరిత్ర సృష్టించారు. శుక్ర‌వారం జ‌రిగిన‌ గ్రాండ్ చెస్ టూర్ ఫైన‌ల్స్ (Grand Chess Tour Finals) టైటిల్‌ను ద‌క్కించుకున్నారు.అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో జరిగిన హోరాహోరీ పోరులో ఫాబియానో కరువానాపై అద్భుతమైన కమ్‌బ్యాక్‌తో ప్రజ్ఞానంద ఈ ఘ‌న‌త సాధించారు. 15-13 తేడాతో విజయం సాధించి తొలిసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా ప్రజ్ఞానంద 2,00,000 డాలర్లు(రూ.2 కోట్లు) ప్రైజ్ మనీ కూడా అంద‌నుంది. ఈ చారిత్రాత్మక విజయంతో ప్రజ్ఞానందకు సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>