కలం, నిర్మల్: రాఖీ పండుగ (Raksha Bandhan) సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం(Nirmal Bus Stand) శుక్రవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సొంతూళ్లకు బయలుదేరడంతో బస్టాండ్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పండుగ నేపథ్యంలో హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండ్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. బస్సుల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

