అనంతపురంలో దారుణం.. టీచర్ గొంతు కోసి!

కలం, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుంతకల్లు (Guntakal)లో దారుణం చోటు చేసుకుంది. అరుణ అనే టీచర్‌పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి అరుణను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి, పరారైన దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

తెలిసినవారి పనేనా..?

టీచర్‌పై పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో దాడి చేయడం గుంతకల్లు పట్టణంలో కలకలం రేపింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు టీచర్ కుటుంబసభ్యులను కూడా విచారిస్తున్నట్లు సమాచారం. అరుణతో ఎవరికైనా విబేధాలున్నాయా.. లేకపోతే మరే ఇతర కారణాలున్నాయా.. అనేది ఆరా తీస్తున్నారు. తెలిసినవారి పనేనా.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారా.. అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>