SIR ప్రక్రియలో ఓటర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సయ్యద్ హైదర్

కలం, నిర్మల్: SIR ప్రక్రియలో ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ (Syed Haider) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పంచశీల్ కళాశాలలో గాజులపేట్ పరిధిలో జరుగుతున్న SIR ప్రక్రియ (SIR Process) ను గురువారం ఆయన పరిశీలించి, డిప్యూటీ తహశీల్దార్ శేఖర్‌ తో సమస్యలపై చర్చించారు.

అర్హులైన ఏ ఒక్క ఓటరుకు అన్యాయం జరగకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. నోటీసులను ఓటర్లు కేంద్రాలకు వచ్చి తీసుకునేలా కాకుండా అధికారులు ఇంటింటికీ వెళ్లి అందించాలని, ఓటర్ల సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరించాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>