కలం, వెబ్ డెస్క్: ఫోన్ మాట్లాడొద్దని తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్ (Hyderabad) లో చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఛత్రినాకలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కుమార్తె తేజస్వి(17) ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే, తేజస్వి ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఫోన్‌లో మాట్లాడుతుండటాన్ని తండ్రి గమనించాడు. అలా అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడవద్దని తేజస్వినిపై కోప్పడ్డాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తేజస్వి, అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇది గమనించిన తండ్రి శ్రీనివాస్ ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. అంతలోనే ఉప్పుగూడ (Uppuguda) రైల్వే ట్రాక్ వద్ద వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తన కళ్లముందే తన కూతురు ప్రాణాలు విడవడం చూసిన తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.

