వర్షం దెబ్బ.. 2 వికెట్ల దూరంలో భారత్!

కలం, స్పోర్ట్స్ : భారత్, శ్రీలంక (India vs Sri Lanka) మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు 4వ రోజు ఆట వర్షం కారణంగా త్వరగానే ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆట మొదలయ్యాక శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినుషా 103 పరుగులతో సెంచరీ చేశాడు. భారత బౌలర్ శరణ్ష్ జైన్ లహిరు కుమారా, సోనాల్ దినుషాలను అవుట్ చేశాడు. దీనితో భారత్‌కు 213 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దాంతో భారత్ శ్రీలంకను ఫాలో-ఆన్ ఆడాల్సిందిగా కోరింది.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. లహిరు ఉదారను 3 పరుగులకే మహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 32 పరుగులు చేసిన కమిల్ మిషారాను పెవిలియన్ పంపాడు. అనంతరం పసిందు సూరియబండార, కమిందు మెండిస్ కలసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కమిందు మెండిస్ 55 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత ధనంజయ డి సిల్వా 23 పరుగులు చేసి మానవ్ సుతార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

సెంచరీకి దగ్గరవుతున్న పసిందు సూరియబండారను 92 పరుగుల వద్ద మానవ్ సుతార్ స్టంప్ అవుట్ చేశాడు. అనంతరం నిరోషన్ డిక్వెల్లాను 6 పరుగుల వద్ద శరణ్ష్ జైన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆట ముగిసే సమయానికి సోనాల్ దినుషా 7 పరుగులు, కేశర నువాంత 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధ్, జడేజా, శరణ్ష్ జైన్ తలొక వికెట్ పడగొట్టారు. చివర్లో వర్షం పడటంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఐదో రోజు ఆటలో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>