మిలాద్ ఉన్ నబీ.. అన్నదానం చేసిన డిప్యూటీ మేయర్

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని భగత్ నగర్, గోదాంగడ్డ ప్రాంతాలలో మిలాద్ ఉన్ నబీ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జైబూన్ యూత్ క్లబ్, ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఉత్సాహంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఆయన మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జైబూన్ యూత్ క్లబ్ సభ్యులు హమీద్, అబ్దుల్ సువాన్, తాహెర్, అయాన్, అజ్జు, అక్తర్, సమీర్ అలాగే ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు వసీంఅక్రమ్, ఇమ్రాన్, అస్లాం, ఉస్మాన్, షేక్ ఇర్ఫాన్, షేక్ జిలాని, సాజిద్, సలీం, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>