కలం, నిర్మల్: ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న నిరుపేద బీసీ విద్యార్థుల (BC Students) కు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిర్మల్ (Nirmal) జిల్లా బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజులు చెల్లించలేక పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి, ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కో-కన్వీనర్లు కత్రోజు అశోక్ చారి, సిరికొండ రమేష్, కొట్టూరి కిషన్, పండరీనాథ్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు మరకంటి జీవన్, నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

