రామచంద్రపురంలో దారుణం: భార్య చేతిలో భర్త బలి!

కలం, వెబ్ డెస్క్ : అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం (Ramachandrapuram)లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ ఒకరి ప్రాణాలను బలిగొంది.

స్థానిక పోలీసుల వివరాల ప్రకారం, తంగేటి ఎల్లారావు (46) అతని భార్య తంగేటి ఉమాదేవి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం దంపతుల మధ్య వివాదం మరింత తీవ్రస్థాయికి చేరింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఉమాదేవి ఇంట్లో ఉన్న మసాలా నూరే రాడ్‌తో భర్త ఎల్లారావు తలపై బాదింది. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై ఎల్లారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>