కలం, కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ (Lower Manair Dam – LMD) వద్ద బుధవారం ఉదయం 6 గంటలకు నమోదు అయిన సమాచారం ప్రకారం జలాశయంలో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం నివేదిక ప్రకారం..
గరిష్ట నీటిమట్టం (FRL) 920.00 అడుగులు (280.48 మీటర్లు)
పూర్తి సామర్థ్యం: 24.034 TMCలు,
నేటి నీటిమట్టం 901.25 అడుగులు (274.77 మీటర్లు), ప్రస్తుత నీటి నిల్వ 10.926 TMCలు,
నిన్నటి నీటిమట్టం 901.25 అడుగులు (10.926 TMCలు),
గత ఏడాది ఇదే రోజు 899.95 అడుగులు (10.253 TMCలు)
వర్షపాతం నిల్..
ప్రస్తుతం జలాశయంలోకి 242 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే పరిమాణంలో (242 క్యూసెక్కులు) బయటకు వెళ్తోంది.
ఇన్‌ఫ్లో (242 క్యూసెక్కులు) నది ద్వారా 242 క్యూసెక్కులు వస్తుండగా.. ఎమ్ఎమ్ఆర్ (MMR), చెక్ డ్యామ్ (CR@144) ల నుండి ఇన్‌ఫ్లో సున్నాగా నమోదైంది.
అవుట్‌ఫ్లో (242 క్యూసెక్కులు).. మిషన్ భగీరథ ద్వారా 143 క్యూసెక్కులు, ఆవిరి నష్టాల (Evaporation) రూపంలో 99 క్యూసెక్కులు పోవుచున్నాయి. స్పిల్‌వే, కాకతీయ కాలువ (KC) ద్వార నీటి విడుదల నిలిపివేశారు.
జూన్ 1, 2026 నుండి ఇప్పటివరకు
ఈ సీజన్లో ఇప్పటివరకు డ్యామ్‌లోకి 6.214 TMCల ఇన్‌ఫ్లో (నది: 1.598, MMR: 4.616) రాగా.. మిషన్ భగీరథ, ఆవిరి నష్టాల రూపంలో 1.653 TMCల నీరు వెచ్చించబడింది.

