కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఈ విషాద సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు మెరుగైన ఉచిత వైద్యం వెంటనే అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించారు. బాధితులకు తక్షణమే తగిన సహాయక చర్యలు అందించాలని అధికారులకు సూచించారు.

