‘ఆవు కొవ్వు’తో వ్యాపారం.. 150 లీటర్ల కల్తీ నూనె సీజ్!

కలం, ఖమ్మం బ్యూరో: గత ఆరు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఆవు కొవ్వు నూనె తయారీ దందాను ముదిగొండ పోలీసులు, ఆహార భద్రతా అధికారులు గుట్టురట్టు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ (Mudigonda) మండలం వెంకటాపురంలో ఆవు కొవ్వు, ఎముకలతో అక్రమంగా తయారు చేస్తున్న 150 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నారు.

​వెంకటాపురంలోని ఒక ఇంట్లో ఆవు కొవ్వు, ఎముకలను గిన్నెల్లో వేసి మరిగిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపించింది. గమనించిన స్థానికులు వెంటనే ముదిగొండ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ సాగుతున్న అక్రమ వ్యవహారాన్ని చూసి పరికరాలను సీజ్ చేయడంతో పాటు ఆహార భద్రతా శాఖ అధికారులకు సమాచారం అందించారు.

​ఆహార భద్రతాధికారి శరత్ అందించిన వివరాల ప్రకారం… షేక్ అన్వర్ జానీ, సర్వర్ జానీ అనే వ్యక్తులు నివాస గృహంలోనే ఈ దందాను నిర్వహిస్తున్నారు. వీరు ప్రతినెలా సుమారు 10 ఆవులను కోసి మాంసం విక్రయించగా, మిగిలిన ఆవు కొవ్వు, ఎముకలను పెద్ద గిన్నెల్లో ఉడికించి నూనెగా మారుస్తున్నారు. ఆ నూనెను డబ్బాల్లో నింపి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఆరు నెలలుగా ఈ వ్యాపారం సాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ​

ఈ తనిఖీల్లో అధికారులు 150 లీటర్ల కల్తీ నూనెతో పాటు 15 కిలోల ఆవు కొవ్వును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నూనె శాంపిళ్లను సేకరించి విశ్లేషణ కోసం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నివేదిక రాగానే నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>