న్యూపోచంపాడ్ గ్రామంలో వనమహోత్సవం

కలం, నిర్మల్ : ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిషోర్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం నిర్మల్‌ రూరల్‌ మండలం న్యూ పోచంపాడ్ (New Pochampad) గ్రామంలో నిర్వహించిన వనమహోత్సవ (Vanamahotsavam) కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడారు.

పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండ పద్మ శ్రీనివాస్, ఎంపీడీవో సుధాకర్, ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్, ఏపీఓ రామకృష్ణ, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>