ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో సవాల్..!

కలం, వెబ్ డెస్క్ : తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు, భౌతిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఎం. ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు లైంగిక సామర్థ్య నిర్దారణ పరీక్షలు (పోటెన్సీ / స్పేర్మ్ టెస్ట్) నిర్వహించేందుకు రాజేంద్ర నగర్ కోర్టు ఇచ్చిన అనుమతిని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.

ఈ మేరకు హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పోటెన్సీ టెస్ట్ నిర్వహించొద్దని హైకోర్టును కోరారు. దీంతో పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. సోమవారం పిటిషన్ ను విచారణ చేస్తామని వెల్లడించింది. కాగా, ఈ కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు జూలై 28న అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు రోజుల కిందట ఉదయ్ కృష్ణారెడ్డి పోలీస్ కస్టడీ ముగిసింది. అయితే కస్టడీ విచారణలో పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ముఖ్యంగా ఈ కేసుకు కీలకమైన సెల్ ఫోన్ మాయం కాగా.. దాని వివరాలను అధికారులు రాబట్టలేకపోయారు. సెల్ ఫోన్ గురించి మర్చిపోయానంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లు సమాచారం అందింది.

Also Read : పొంగులేటి పర్యటన.. నిజామాబాద్‌లో ఉద్రిక్తత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>