కామారెడ్డి టీచర్‌కు అరుదైన గౌరవం.. జాతీయ అవార్డుకు ఎంపిక!

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన మారుమూల ప్రాంత ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. గాంధారి మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల HM బొంపెల్లి భవాని (Teacher Bhavani) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా ఆమె ఈ అవార్డు అందుకోనున్నారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన భవాని 2018 నుంచి బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ల ద్వారా వినూత్న రీతిలో విద్యార్థులకు బోధిస్తూ పేరుపొందారు. తెలంగాణ SCERT ‘ట్రయల్ బ్లేజర్స్’ పేరిట ప్రచురించిన పుస్తకంలో.. అవరోధాలను అధిగమించి పాఠశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచారంటూ భవాని పాఠాన్ని అందులో చేర్చారు. సీఎం చేతుల మీదుగా ఆమె ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 48 మందితో కూడిన జాబితాలో తెలంగాణ నుంచి HM భవానికి చోటు దక్కడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>