యాదాద్రి జిల్లాలో దారుణం.. ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి అఘాయిత్యం!

కలం, మోత్కూరు : ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఒక మానసిక దివ్యాంగురాలిపై అధికార పార్టీకి చెందిన నాయకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం (Atmakur M)లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఒక గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికిన గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు తెలపడంతో గ్రామంలో కలకలం రేగింది. బాధితురాలి భర్త స్థానిక పెద్దమనుషులను ఆశ్రయించగా, వారి సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. అయితే, అక్రమాన్ని అడ్డుకోవాల్సిన పెద్దమనుషులు దాన్ని బయటకు రానివ్వకుండా చేసే ప్రయత్నం చేయడమే కాకుండా, శంకర్‌రెడ్డి బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నిందితుడి బెదిరింపులకు భయపడకుండా బాధిత మహిళ భర్త ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో శంకర్‌రెడ్డిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దివ్యాంగురాలిపై అరాచకానికి ఒడిగట్టడమే కాకుండా కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురిచేసిన కాంగ్రెస్ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దివ్యాంగురాలిపై జరిగిన ఈ అమానుష ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>