కలం, నాగర్ కర్నూల్: పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. నియోజకవర్గంలోని తాడూరు, తిమ్మాజిపేట, బిజినపల్లి మండలాల్లోని రైతులకు ఎమ్మెల్యే స్ప్రింక్లర్లు అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ…రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
అయితే ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల వల్ల రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. రైతులకు వ్యవసాయంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం స్ప్రింక్లర్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. వ్యవసాయ శాఖ సూచించిన మేరకు రైతులు సాగు చేసుకోవాలని అన్నారు. రైతులు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

