రాయదుర్గం భూములకు రికార్డ్ ధర.. ఎకరం రూ.264 కోట్లు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మహానగరంలో రాయదుర్గం భూములు (Rayadurg Lands) రికార్డ్ ధర పలికింది. రాయదుర్గంలో ప్లాట్ నంబర్ P1కి సంబంధించి టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో ఎకరా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది. ప్లాట్ విస్తీర్ణం మొత్తం 5.25 ఎకరాలు ఉండగా, ఎకరాకు రూ. 264 కోట్ల చొప్పున లెక్కగడితే ఈ స్థలం మొత్తం విలువ రూ.1,386 కోట్లకు చేరింది.

ఈ అత్యంత ఖరీదైన స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘MSN రియాల్టీస్’ ఆక్షన్ లో పాల్గొని చేజిక్కించుకుంది. ఇది ఇప్పటివరకు జరిగిన భూముల వేలంలోనే సరికొత్త ఆల్టైమ్ రికార్డుగా నిలిచింది. ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిన ఈ వేలం ప్రక్రియ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ వేలం హాట్ టాపిక్ గా మారింది.

Also Read : సుష్మిత కామెంట్లపై మంత్రుల మౌనం.. అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>