విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ ఆటలు: పొన్నం అనిల్

కలం, కరీంనగర్: ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన విద్యను ప్రైవేట్ భాగస్వామ్యంలో నడిచే స్కిల్ వర్సిటీకి అప్పగించడం వెనుక కుట్ర ఉందని కరీంనగర్ బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ (Ponnam Anil Kumar Goud) ఆరోపించారు. భవిష్యత్తులో ఫీజుల భారం భారీగా పెరుగుతుందని, విద్యార్థులకు సాంకేతిక విద్యకు దూరం చేసే కుట్రను రేవంత్ సర్కార్ చేస్తోందని దుయ్యబట్టారు. ‘శక్తి’ స్కీమ్, జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేక విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీల వైపు నెట్టివేయడం దుర్మార్గం అన్నారు.

మళ్లీ ఇంటర్ చదవాలి..

గతంలో పాలిటెక్నిక్ ముగిశాక నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశం ఉండేదని, శక్తి స్కీమ్‌తో ఆ సదుపాయం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ రెండు సంవత్సరాలు ఇంటర్ చదవాల్సి వస్తుందన్నారు. విద్యాశాఖను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని బలహీనపరిచే విధానాలను అవలంబించడం అత్యంత దురదృష్టకరమన్నారు.

మహబూబాబాద్‌‌లో సీఐ రఘుపతి రెడ్డి విద్యార్థి గొంతు నొక్కడం క్రూరత్వానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్వీ నగర అధ్యక్షులు బొంకూరి మోహన్ , ఆరే రవి గౌడ్ , నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు , నారదాసు వసంత్ రావు, బండ వేణు యాదవ్ , సోమిరెడ్డి నరేష్ రెడ్డి, వడ్లకొండ పర్షరాం, గంటల రేణుక , విక్రమ్ , శనిగరం సతీష్, పెరుమాండ్ల హరీష్ పాల్గొన్నారు.

Also Read : మొబైల్‌ కనెక్షన్లపై కేంద్రం కొత్త నిబంధనలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>