కలం, జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజల ప్రభుత్వమని.. వారికి అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా (Jagtial) నూకపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగారావులతో మంత్రి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆడ్లూరి మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా నూకపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు లేక పేదలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఎమ్మెల్యే సంజయ్ మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదన పంపించారని తెలిపారు.
ఎమ్మెల్యే సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 62 కోట్లు కేటాయించిందని మంత్రి వివరించారు. నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ పిల్లలు పేద మధ్యతరగతి వారు ఉండటంతో వారికి సౌకర్యాలు కల్పించడానికి నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.
జగిత్యాలలో మంత్రి పర్యటన
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) శుక్రవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి అడ్లూరి (Adluri Laxman) తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల జిల్లాకు చేరుకుంటారని చెప్పారు. ధరూర్ క్యాంప్ వద్ద జగిత్యాల జిల్లాలో నూతనంగా మంజూరైన జగిత్యాల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు నూకపల్లి డబుల్ బెడ్ రూమ్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడతారని మంత్రి వివరించారు. అనంతరం జగిత్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 4:30 గంటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు వివరించారు. పొంగులేటి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.
Also Read : మొబైల్ కనెక్షన్లపై కేంద్రం కొత్త నిబంధనలు
Follow Us On: X(Twitter)

