కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై (YS Jagan) మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. APPSC, DSC మధ్య తేడా కూడా తెలియని స్థాయిలో జగన్కు రాష్ట్ర పరీక్షల వ్యవస్థపై అవగాహన ఉందంటూ ఎద్దేవా చేశారు. “APPSC అంటే ఏమిటో తెలియదు.. DSC అంటే ఏమిటో తెలియదు.. రెండూ ఒకటేనని అనుకుంటున్నారు” అంటూ లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ స్థాయి అవగాహనతోనే జగన్ తన పదవీకాలంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని లోకేశ్ విమర్శించారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రావాల్సిన సమయంలో జగన్ డిబేట్ నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.

