కలం, వెబ్ డెస్క్ : సీనియర్ నటి షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె వారం రోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో నిన్న రాత్రి వైద్యులు ఆమెను అత్యవసర విభాగం (ICU)కి తరలించారు.
ప్రస్తుతం 95 ఏళ్ల షావుకారు జానకికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 1950లో వచ్చిన ‘షావుకారు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 400 పైగా చిత్రాలలో నటించి విశేష ఆదరణ పొందారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

