కలం, వెబ్‌డెస్క్: పెళ్లంటే ఎవరికైనా జీవితంలో ఒకేసారి జరుగుతుంది అంటుంటారు. కానీ, ఆ జంటలు మాత్రం రెండో సారి పెళ్లి పీటలెక్కారు. మూడు ముళ్ల బంధంతో మళ్లీ ఏకమయ్యారు. ఈ వింత ఘటన కాకినాడ జిల్లా అన్నవరం (Annavaram)లోని రత్నగిరిపై జరిగింది. గతంలో జరిగిన వివాహాల్లో దోషాలు ఉన్నాయని, ఆ కష్టాలు తీరాలంటే మళ్లీ వివాహం చేసుకోవాలని ఓ సిద్ధాంతి చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దంపతులు వెల్లడించారు.
ఈ విధంగా మరోసారి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబంలో ఉన్న చికాకులు, కష్టాలు, దోషాలు తొలగిపోతాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ తొమ్మిది జంటల్లో మూడు జంటలు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామానికి చెందినవి కాగా, మిగిలిన ఆరు జంటలు ఆనందపురం మండలానికి చెందినవి. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కష్టాలు పోవడానికి మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏమిటని కొందరు కామెంట్ ప్రశ్నిస్తున్నారు. ఇది మూఢనమ్మకమని, ఈ రోజుల్లో ఇలాంటివి నమ్మేవాళ్లు కూడా ఉన్నారా? అని కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోసం భలే థ్రిల్లింగ్‌గా ఉంటుందని, వీళ్లంతా చాలా లక్కీ అని అంటున్నారు.

