బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి!

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి (Car Accident) సమీపంలో ఉన్న బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన ధన్ల రాజు (35), ఆయన భార్య భాగ్య (22), కుమారుడు నియాన్స్ (5), కుమార్తె శాన్విక (3)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురూ నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందారు.

సిద్దిపేటలో నిన్న రాత్రి దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని సొంతూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ కుటుంబం ఇంటికి రాకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కారు బావిలో పడ్డట్టు గుర్తించారు. దుబ్బాక సీఐ, ఎస్‌ఐ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బావిలో నుంచి కారును, మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>