నేడు దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం: అమిత్ షా అధ్యక్షతన భేటీ!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో దక్షిణ జోనల్ కౌన్సిల్ (Southern Zonal Council) సమావేశం నేడు ప్రారంభం కానుంది. కేంద్రం, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య భాగస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, వివిధ ప్రాంతీయ సమస్యలకు సమగ్ర పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా ఈ కీలక సమావేశం కొనసాగనుంది.

ఈ ఉన్నత స్థాయి భేటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ 5 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పాలనాధికారులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రాల మధ్య వివాదాలు, నీటి పంపకాలు, రవాణా, మౌలిక వసతుల కల్పన, శాంతిభద్రతల సమన్వయం వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>