కలం, వరంగల్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు (Konda Surekha Birthday Celebrations) వరంగల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మ మైదాన్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ తల్వార్‌తో కేక్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వేడుకలకు హాజరైన అభిమానులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్‌ను తల్వార్‌తో కట్ చేశారు.
సురేఖ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ మైదాన్‌లో జరిగిన వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుస్మితా పటేల్ తల్వార్‌తో కేక్ కట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

