అంతర్గాంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

కలం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం (Anthargaon) గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar), రాధిక దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్రమైన హనుమాన్ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మిక అనుభూతిగా ఉందన్నారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

హనుమంతుడు భక్తి, ధైర్యం, సేవాభావం, నిస్వార్థ త్యాగానికి ప్రతీక అని, శ్రీరాముడిపై ఆయన చూపిన అచంచలమైన భక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. నేటి యువత హనుమంతుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు. ఆలయాలు కేవలం పూజలు నిర్వహించే ప్రదేశాలు మాత్రమే కాకుండా సమాజంలో ఐక్యమత్యం, సాంస్కృతిక విలువలను పెంపొందించే కేంద్రాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నోముల రమ్య శేఖర్ రెడ్డి, గ్రామ, మండల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>