కలం, వెబ్ డెస్క్ : ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు (TG High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ విచారణలో భాగంగా చట్టబద్ధతలేని పథకాలకు ప్రజాధనం వృథా చేస్తే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వరంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి ఉచిత పథకాలకు ఖర్చు చేయవచ్చు కదా అని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది.
భూసేకరణలో న్యాయం జరగక బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని.. భూ బాధితుల విషయంలో ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులకు సూచించింది. పథకాలపై స్టే తొలగించాలన్న ప్రభుత్వం విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరిస్తూ.. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

