కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ (Soan) మండల కేంద్రంలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) సుధాకర్ బుధవారం పర్యటించారు. వీబీజీ రాంజీ పథకం కింద నిర్మించిన వర్క్ షెడ్‌ను ఆయన పరిశీలించారు. చేపల మార్కెట్ (Fish Market) ను పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేపల మార్కెట్‌ను సోన్ గ్రామ ప్రజలతో పాటు మండలంలోని పరిసర గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మార్కెట్‌లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ కట్కం రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అంపోలి వనజ, ఏపీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

