కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ (TTD) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో నేడు ఎస్ఎస్డీ (స్లాటెడ్ సర్వ దర్శనం) టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ మేరకు శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టోకెన్ల జారీని టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో గురువారం బుధవారం చేసే టోకెన్లు ఇవ్వరని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవచ్చని అన్నారు.
అయితే శుక్రవారం దర్శనానికి గురువారం మధ్యాహ్నం టోకెన్లు జారీ చేస్తారని అధికారులు వెల్లడించారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. కాగా, ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో టీటీడీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. గత 8 వారాలుగా ఈ విధానాన్ని టీటీడీ పరిశీలిస్తోంది.

