వీడిన‌ తాడూర్ మ‌హిళ హ‌త్య కేసు మిస్ట‌రీ!

కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ (Tadoor) పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ హత్య కేసు (Woman Murder Case)ను పోలీసులు ఛేదించారు. ఈ సంఘటనపై డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెలకపల్లి మండలం రాకొండ గ్రామానికి చెందిన నాగి బంగారమ్మ (43) మూడు రోజుల క్రితం హత్యకు గురైంది. తాడూర్ గ్రామానికి చెందిన ఎన్నుపోతుల భీమయ్య (38)ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. నాలుగేళ్లుగా బంగారమ్మతో భీమయ్యకు పరిచయం ఉన్నట్లు పోలీసుల‌ విచారణలో వెల్లడైంది. బంగారమ్మ తన పొలం విక్రయించిన సమయంలో భీమయ్య కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని బంగారమ్మ కొంతకాలంగా భీమయ్యను అడుగుతోంది. డబ్బులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో బంగారమ్మను హత్య చేయాలని భీమయ్య పథకం వేశాడు.

ఆగస్టు 15న డబ్బుల విషయమై మాట్లాడేందుకు బంగారమ్మను తన పొలం వద్దకు రావాలని భీమయ్య పిలిచాడు. పొలం వద్దకు వెళ్లిన బంగారమ్మతో డబ్బుల విషయమై గొడవ ప‌డ్డాడు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో బొలెరో వాహనంతో బంగారమ్మను ఢీకొట్టి, ఆమెపై నుంచి రెండుసార్లు వాహనం నడిపాడు. తీవ్ర గాయాలతో బంగారమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. భీమయ్యను మంగ‌ళ‌వారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి TS 31 TA 4888 నంబర్ గల బొలెరో వాహనం, వివో వై39 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి చెందిన రెండు బస్ టికెట్లు, ఆధార్ కార్డు, చేతి సంచిని కూడా పోలీసులు రికవరీ చేశారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటు నాగర్‌కర్నూల్ సీఐ అశోక్‌రెడ్డి, తాడూర్ ఎస్సై రాములు, కానిస్టేబుల్ రమేష్, తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>