ముధోల్ అభివృద్ధిపై మంత్రి సీతక్కతో పవార్ భేటీ

కలం, నిర్మల్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను (Minister Seethakka) ముధోల్ ఎమ్మెల్యే (Mudhole MLA) పవార్ రామారావు పటేల్ మంగళవారం కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హమ్ పథకం కింద మంజూరైన రోడ్ల పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో పలు రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులను వేగంగా చేపట్టి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట్ల డబుల్‌ లైన్‌ రోడ్లను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్కను కోరారు. రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ సన్నిధిలో బంజారాల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ ఆలయ నిర్మాణానికి ఒక ఎకరం స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రి సీతక్కను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>