ఆ పథకాలను కొనసాగించాల్సిందే.. కాంగ్రెస్‌కి సండ్ర వార్నింగ్

కలం, సత్తుపల్లి: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) బీఆర్‌ఎస్‌ నిరసన ర్యాలీ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వకపోగా, కేసీఆర్ ప్రభుత్వం అందించిన రూ. 1,00,116 సహాయాన్ని కూడా అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను వంచిస్తోందని ఆయన ఆరోపించారు.

​ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. లబ్ధిదారులకు వెంటనే కళ్యాణలక్ష్మి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతు బీమా చెల్లించాలని సండ్ర డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>