రోడ్డు పనుల్లో సంచలనం.. మట్టి కుప్పలో మృతదేహాలు!

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం (Vizag)లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే సంఘటన చోటుచేసుకుంది. విశాఖ షీలానగర్ నుంచి పోర్టుకు వెళ్లే మార్గంలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనుల ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రోడ్డు నిర్మాణ పనుల కోసం అక్కడ వేసిన మట్టికుప్ప నుంచి మూడు డెడ్ బాడీలు బయటపడటంతో స్థానిక ప్రజలు, కార్మికులు భయాందోళనలకు గురయ్యారు.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ మృతదేహాలు ఎవరివి, హత్య చేసి ఇక్కడ మట్టిలో పూడ్చిపెట్టారా లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డు పనుల కోసం మట్టిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>