కలం, వెబ్ డెస్క్: నిషేధిత భూముల (Prohibited Lands) విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రకటించారు. సమస్య పరిష్కారానికి ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సందేహాల నివృత్తి కోసం, సమ్యసను విన్నవించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ 18005994788 కూడా అందుబాటులో తెస్తున్నట్లు వివరించారు. నిషిద్ధ జాబితాలో ఉన్న ప్రతి ప్రైవేట్ ల్యాండ్ క్లియర్ చేసే చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 757 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన ప్రతి దరఖాస్తును నెలాఖరులోగానే పరిష్కారం అయ్యేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.
ఆ రెండు ప్రధాన లక్ష్యాలు..
నిజమైన భూ హక్కుదారుడికి న్యాయం చేయడం, ప్రభుత్వ భూములు, ఆస్తులు కాపాడాలనే రెండు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) వివరించారు. 22ఏ జాబితాలో ప్రైవేట్ ల్యాండ్ ఎలా వచ్చిందో.. రికార్డులు ఎలా ఉన్నాయో పూర్తిగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. సబ్ రిజిస్ట్రార్లకు ఇక నుంచి పహాణి జారీ అధికారం ఇస్తున్నట్లు, రికార్డులు సరిగ్గా ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేయాలన్నారు. ఇందుకోసం అదనంగా స్లాట్‌ల సంఖ్య పెంచుకోవాలని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేని భూములు ఉంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారులకు స్పష్టంగా చెప్పాలన్నారు. వారు చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేయాలన్నారు. గతంలో హైకోర్ట్ ఆదేశాలతో అధికారులు 22ఏ నుంచి భూములు తొలగించే విధానంలో తప్పులు దొర్లి, నిషేధిత జాబితాలోనే ఉండిపోయినట్లు చెప్పారు. భూదాన్, దేవాదాయ, ఫారెస్ట్ భూముల పక్కన ఉన్న కొన్ని ప్రైవేట్ భూములు సైతం నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయినట్లు అంగీకరించారు.
Also Read : గాంధీభవన్‌లో సామాజిక వర్గాల రగడ… క్రమ‘శిక్ష’ణలో వివక్ష!
Follow Us On: X(Twitter)

