సోనియా గాంధీ వందేమాతరం అడ్డుకోవడం సిగ్గు చేటు: బీజేవైఎం

కలం, నిజామాబాద్ బ్యూరో: బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు బీజేవైఎం (Nizamabad BJYM) నాయకులు వందేమాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ ఖర్గే లాంటి వారు స్వాతంత్య్ర దినోత్సవం రోజు వందేమాతరం ఆలపించలేదని ఆందోళనకారులు విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ.. 1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర గీతం ఒక రణ నినాదంగా మారి అనేకమంది ప్రజలను చైతన్యవంతం చేసిందని గుర్తు చేశారు.

బంకించంద్ర చటర్జీ దూర దృష్టితో వందేమాతర గీతాన్ని రచించి స్వతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు. అటువంటి వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు మళ్ళీ వందేమాతర గీతాన్ని మదిలో నిలుపుకొని వందేమాతరం యొక్క చరిత్ర తెలుసుకోవాలని చెప్పారు.

ఆ స్పూర్తి తో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి వందేమాతరం అధికారిక కార్యక్రమాల్లో ఆలపించాలని చట్టం తీసుకోవడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒక వర్గానికి సంతృప్తి కల్పించాలనే ఉద్దేశంతో పూర్తి వందేమాతర గీతాన్ని పాడకుండా అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నేతలు సుధీర్, చిరంజీవి, శశాంక్, శ్రావణ్, బీజేవైఎం (BJYM) నాయకులు విపుల్, ప్రశాంత్, రాజశేఖర్, మహేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : దీక్షా దాగర్‌కు షాక్: టాప్-10 నుంచి అవుట్!

Follow Us On: X(Twitter)

నిజామాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>