కలం, కరీంనగర్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ అత్యున్నత జాతీయ గేయమైన ‘వందేమాతరం’ ఆలాపన వేళ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రదర్శించిన నిర్లక్ష్యం, గేయం పట్ల అవలంభించిన అవమానకర వైఖరిపై కరీంనగర్ బీజేవైఎం తీవ్ర నిరసన (BJYM Protests) వ్యక్తం చేసింది. సోమవారం కరీంనగర్ (Karimnagar) కోర్టు చౌరస్తాలో భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం సంపూర్ణ ఆలాపన జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తదితరులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించారని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంగ నరేష్ తీవ్రంగా మండిపడ్డారు. జాతీయ గేయం పట్ల కనీస గౌరవం ప్రదర్శించకపోగా, ఇతరులతో మాట్లాడుతూ ఆలాపనకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన ధ్వజమెత్తారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశభక్తిని చాటాల్సిన పవిత్ర వేదికపైనే జాతీయ గేయానికి అవమానం జరగడం క్షమించరాని నేరమని వారు ఆరోపించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో అగ్రగణ్యమైన స్థానం ఉన్న వందేమాతరం గేయాన్ని అవమానించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం(BJYM Protests)లో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు గుజ్జ శ్రీనివాస్ రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిగంటి కుమార్, ST మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, ST మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, ఎడవెల్లి శశిధర్ రెడ్డి, నక్క ప్రమోద్, గుర్రం వెంకటేశ్ గౌడ్, ఆకుల మనోహర్, సతీష్, తాడూరి కిరణ్, సుదమల్ల నాగరాజు, రమేష్ యాదవ్, రాసబక్తుల వినయ్, గడ్డం సందీప్, జాగిరి రాజేందర్, కార్తిక్, శ్రీకర్, నవీన్, గణేష్ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : ఉదయ్ కృష్ణారెడ్డికి మరో రెండు రోజుల పోలీస్ కస్టడీ!
Follow Us On : WhatsApp
కరీంనగర్ వార్తల కోసం క్లిక్ చేయండి

