కలం, మునుగోడు (చండూరు): ప్రజావాణి (Prajavani) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు (Chandur) ఎంపీడీవో యాదగిరి (MPDO Yadagiri) తెలిపారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. ప్రజావాణి మొదటి రోజు కావడం వల్ల దరఖాస్తులు తక్కువగా వచ్చాయన్నారు.
రానున్న సోమవారం మళ్లీ జరిగే ప్రజావాణిలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ చేయడం జరిగిందని, కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగమల్లేశం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

