కలం, వెబ్‌డెస్క్: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూయార్క్‌లో నిర్వహించిన 44వ ఇండియా డే పరేడ్ పరేడ్ (India Day Parade) ఎంతో ఆకట్టుకుంది. ఈ పరేడ్‌లో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్, ఇతర ప్రముఖులతో కలిసి ఆమె మ్యాన్‌హట్టన్ వీధుల్లో జరిగిన వేడుకల్లో భాగమయ్యారు. ఈ వేడుకలకు న్యూయార్క్‌లోని భారతీయులు భారీ ఎత్తున హాజరయ్యారు. పూజతో పాటు ఈ పరేడ్‌లో నటి తాప్సీ, నటుడు, డైరెక్టర్ అడివి శేష్, తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్ టీమ్ కూడా సందడి చేసింది. ఈ వేడుకల్లో పూజా హెగ్డే బుట్ట బొమ్మ పాటకు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికాలో జరిగిన ఈ అతిపెద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భారత సాంస్కృతిక వైభవం, టెక్నాలజీ, వాణిజ్య రంగాల్లో దేశం సాధిస్తున్న ప్రగతిని ప్రతిబింబించేలా ప్రత్యేక శకటాలను ప్రదర్శించారు. భారత్-అమెరికా భాగస్వామ్య బలాన్ని చాటిచెప్పేలా, భారత్ కీర్తిని ప్రపంచ వేదికపై మరింత బలప్చేలా ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

