కలం, నిజామాబాద్ బ్యూరో : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ (Nizamabad) ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

