కలం, వెబ్ డెస్క్ : డీఎస్సీ -2025 నిర్వహణపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డీఎస్సీని చాలా బాధ్యతగా భావించి నిర్వహించామని చెప్పారు. టీసీఎస్ అయాన్ సెంటర్స్ ద్వారా పరీక్షలు పూర్తి చేసి 12 దశల్లో పారదర్శంగా డీఎస్సీ పరీక్షలు పూర్తి చేశామన్నారు. 148 రోజుల్లో ప్రక్రియను ఏపీ తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా పూర్తి చేయలేదని లోకేష్ చెప్పుకొచ్చారు.
గతంలో స్పోర్ట్స్ కోటాలో 29 పోస్టులు ఉంటే 65 కు పెంచామని.. కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే స్పోర్ట్స్ కోటాను పెంచినట్లు స్పష్టం చేశారు. కొందరికి డీఎస్సీ అంటే అర్ధం కూడా తెలియదని.. వైసీపీ నేతలు కావాలనే కేసులు వేశారని లోకేష్ ఆరోపించారు. తప్పుడు సరర్టిపికెట్లతో ఉద్యోగాలు పొందారు అనడానికి ఆధారాలు చూపాలని ఆయన సవాల్ విసిరారు. ప్రశ్నాపత్రం రూపొందించడంలో బయటివారి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు.

