కలం, వెబ్ డెస్క్ : బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం (Ashok Dham Temple) వద్ద సోమవారం తొక్కిసలాట జరిగింది. విద్యుత్ తీగ తెగిపోవడంతో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులు లఖిసరాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా తగిన ఏర్పాటు చేసినా ఊహించని రీతిలో భక్తులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. జనసమూహం భారీగా ఉండడంతో ఒత్తిడి బారికేడింగ్ లోని ఒక భాగం కూలిపోవడంతో ఒకరిపై ఒకరు పడడంతో ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.

