ప్రభుత్వ ఉద్యోగంతో ఆర్థిక భరోసా: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కలం, కల్వకుర్తి: ప్రభుత్వ ఉద్యోగంతో జీవితానికి స్థిరత్వం, కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందని ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్, టాస్క్ COO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి (Kalwakurthy) పట్టణంలోని ఓల్డ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ భవనంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ రెండో బ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో 7 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రావడం యువతకు మంచి అవకాశమన్నారు. అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం కావడం కాకుండా ముందుగానే లక్ష్యంతో సిద్ధం కావాలని సూచించారు.

మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి..

నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొదటి బ్యాచ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశామని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ప్రతిభ ఉన్న యువతకు సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని, ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ కలకు అడ్డంకిగా మారకూడదని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుతూ శారీరక, రాత పరీక్షలకు సిద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు.మాజీ కౌన్సిలర్ బోజి రెడ్డి, అధ్యాపకులు మోహన్ లాల్, ఫౌండేషన్ సభ్యులు యూసుఫ్ బాబా, గణేష్, శేఖర్, శ్రీపతి, శ్రీను పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>