కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(MLA Pawar Rama Rao Patel) కృషితో బాసర లిఫ్ట్ ఇరిగేషన్‌కు (Basara Lift Irrigation) మూడో పంపు మోటార్‌ను సమకూర్చినట్లు బాసర లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్ తెలిపారు. నూతనంగా ఏర్పాటైన బాసర లిఫ్ట్ ఇరిగేషన్ కమిటీ అధ్యక్షుడు ఎం.డి. అజ్గర్, చైర్మన్ పోగుల రాజేశ్వర్‌తో పాటు కమిటీ సభ్యులు ఆదివారం మూడో పంపు మోటార్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మోటార్ పనితీరు, ఏర్పాట్లను పరిశీలించారు.
మూడో పంపు మోటార్ అందుబాటులోకి రావడంతో బాసర ప్రాంత రైతులకు సాగునీటి ఇబ్బందులు మరింత తగ్గనున్నాయని పోగుల రాజేశ్వర్ తెలిపారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు సకాలంలో అందేలా లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మూడో పంపు మోటార్ అందుబాటులోకి రావడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

