కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని నలసోపారా (Nalasopara) పట్టణంలో బర్త్ డే వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కుటుంబసభ్యులు సమీపంలోని బేకరీ నుంచి కేక్ తెప్పించారు. అందరూ కలిసి కట్ చేసి ఆడుతూ పాడుతూ తిన్నారు. అనంతరం కొద్ది సేపటికే వారిలో 11 మందికి వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరినవారిలో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు.
బల్లి ఉందని గమనించి..
కేక్‌ను జాగ్రత్తగా పరిశీలించగా.. చనిపోయిన బల్లి శరీర భాగాలు కనిపించడంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఫుడ్ సేఫ్టీ అధికారులను రప్పించారు. ఇటీవలే పుణేలోని ఓ ఐస్ క్రీం పార్లర్‌లో ఏకంగా ఐస్ క్రీంలో ఎలుక కనిపించింది. ఫుడ్ సేఫ్ట్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్డర్లు చేసి తెప్పించుకుంటున్న ఆహార పదార్థాల్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు.
Also Read : కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

