కలం, వెబ్ డెస్క్: ములుగు ప్రీమియర్ లీగ్ పేరుతో మంత్రి సీతక్క (Seethakka) కుమారుడు సూర్య బెట్టింగ్‌లకు పాల్పడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత వై. సతీష్ రెడ్డి (Sathish Reddy) ఆరోపించారు. పోలీస్ స్టేడియంలో ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభమైన ములుగు ప్రీమియర్ లీగ్‌ను అడ్డుపెట్టుకుని 1XBA బెట్టింగ్ సైట్‌లో ప్రతి బాల్, ప్రతి ఓవర్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టామని పేర్కొంటూ, సీతక్క కుమారుడు యువత జేబులను కొల్లగొడుతున్నారని విమర్శించారు. మంత్రి సీతక్క ఇసుక మాఫియాను నడుపుతుంటే, ఆమె కుమారుడు బెట్టింగ్ మాఫియాను నిర్వహిస్తున్నారని ఆరోపణలు చేశారు.
Also Read : హైదరాబాద్ సిటీ పోలీస్‌లో ఉద్యోగాలు.. వారే అర్హులు!
Follow Us On : WhatsApp

