కలం, నిర్మల్ : దేశ మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నివాళులర్పించారు. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti) వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ సేవకు అంకితమైన మహోన్నత నాయకుడని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవలో నిబద్ధతకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, సమగ్రత కోసం వాజ్‌పేయి చేసిన సేవలు, చూపినమార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వాజ్‌పేయి ఆదర్శాలు, స్ఫూర్తి భారత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

